కర్నూలు(సెంట్రల్): విశ్రాంత డీఆర్వో జి.పుల్లయ్య మృతి చెందారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్యాన్సర్‌తో పోరాడుతూ సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఆయన గతంలో కర్నూలు డీఆర్వోగా, తహసీల్దార్‌గా పనిచేశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా నంద్యాల డీఆర్వోగా వెళ్లారు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లా డీఆర్వోగా పనిచేస్తూ ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో కర్నూలులోనే ఉంటున్న ఆయన క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.నాగరాజు, లక్ష్మీరాజు తదితరులు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
ఆస్పరి: బిణిగేరి గ్రామ సమీపంలో సోమ వా రం ట్రాక్టర్ కింద పడి మహేష్ బాబు (24) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు మేరకు.. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామం నుంచి నాపరాళ్ల లోడుతో డ్రైవర్ శేఖర్‌తో పాటు మహేష్ బాబు ఆదోని మండలం పెద్దహరివాణంకు అన్‌లోడు కోసం వెళ్తున్నారు. బిణిగేరి గ్రామం సమీపంలో డ్రైవర్ శేఖర్ దగ్గర కూర్చున్న మహేష్ బాబు జారి కింద పడ్డాడు. దీంతో వెనుక టైర్లు ఎక్కడంతో మహేష్‌బాబు అక్కడక్కడే మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
నంద్యాల(అర్బన్): పంటల సాగులో రైతులు వైవిధ్యం పాటించినప్పుడే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్సన్ అన్నారు. స్థానిక కార్యాలయ ఆవరణలో సోమవారం పంటల వైవిధ్యం అనే అంశంపై జిల్లాలోని ఏఈఓలకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక ఎకరం వరి పంటకు ఇచ్చే నీటితో సుమారు 2–3 ఎకరాల ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాలను సాగు చేయాలని సూచించారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి మాట్లాడుతూ సీమ ప్రాంతంలో సుమారు 45 శాతం మెట్ట భూమి సాగులో ఉందని, అందులో పంట వైవిద్యాన్ని పాటించాలన్నారు. బెట్టను తట్టుకొనే వంగడాలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు గిరిజారాణి, డాక్టర్ అశోక్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


