పరీక్షలపై తప్పుడు ప్రచారం తగదు | - | Sakshi
Sakshi News home page

పరీక్షలపై తప్పుడు ప్రచారం తగదు

Feb 27 2026 4:21 AM | Updated on Feb 27 2026 4:21 AM

పరీక్షలపై తప్పుడు  ప్రచారం తగదు

పరీక్షలపై తప్పుడు ప్రచారం తగదు

పరీక్షలపై తప్పుడు ప్రచారం తగదు

కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రఽశాంతంగా జరుగుతున్నాయని, ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న జరిగిన ఫస్ట్‌ ఇయర్‌ పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఆదోనిలోని అక్షరశ్రీ జూనియర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ఆలస్యంగా ఇచ్చారని, బుధవారం రోజున కొంత మంది పేరెంట్స్‌ ప్రశ్నపత్రాన్ని మొదటి రోజున ఆలస్యంగా ఇచ్చా రని పరీక్షల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారన్నారు. ఈ కారణంగా పరీక్ష నిర్వహణలో కొంత అంతరాయం కలిగిందన్నా రు. సమాచారం తెలిసి పరీక్ష ముగిసిన తరువాత ఆ సెంటర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించామన్నారు. పరీక్ష మొదలయ్యాక ప్రశ్నపత్రాన్ని 9.04 గంటలకు పంపిణీ చేసి, పరీక్ష అయ్యాక 12.04 గంటలకు సమాధాన పత్రాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. పరీక్షల నిర్వహణపై అపోహలు సృష్టించినా.. తప్పుడు ప్రచారం చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గురువారం నిర్వహించిన పరీక్షకు 21,428 మంది విద్యార్థుల్లో 21,135 మంది హాజరైనట్లు ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి పేర్కొన్నారు.

గిరిజన ప్రతిభా పాఠశాల, కళాశాలలో ప్రవేశాలు

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం గిరిజన గురుకుల ప్రతిభా పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ ప్రాజెక్ట్‌ అధికారి ఎ.సురేష్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి, ఇంటర్మీడియెట్‌ ప్రవేశాలకు గిరిజన బాలుర నుంచి ధరఖాస్తులు ఆ హ్వానిస్తున్నామన్నారు. 8వ తరగతిలో 45 సీట్లు, ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో 45 సీట్లు, బైపీసీలో 45 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. aptwgurukulam.ap.gov.inలో ఆన్‌లైన్‌లో రుసుం రూ.50 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు చివరి తేది మార్చి నెల 4వ తేదీ కాగా.. ప్రవేశ పరీక్ష మార్చి 8న నిర్వహిస్తామన్నారు. వివరాలకు 8వ తరగతి ప్రవేశానికి 9885670106, ఇంటర్మీడియెట్‌ ప్రవేశానికి 80991 72737, 91778 19676 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

డిగ్రీ పరీక్షలకు

85 శాతం హాజరు

కర్నూలు(సెంట్రల్‌): ఆర్‌యూ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో నిర్వహిస్తున్న ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షకు గురువారం 85 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 99 మంది విద్యార్థుల్లో 84 మంది హాజరయ్యారు. కర్నూలు రవీంద్ర డిగ్రీ కాలేజీలో ఒక్కరు డీబార్‌ అయ్యారు. అలాగే బీటెక్‌ పరీక్షలకు 99 శాతం, లా పరీక్షకు 92 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

సి.బెళగల్‌: మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆర్జేడీ శామ్యూల్‌ అన్నారు. గురువారం ఆయన డీఈఓ సుధాకర్‌తో కలసి సి.బెళగల్‌ మోడల్‌ స్కూల్‌, కస్తూర్బా పాఠశాలలను తనిఖీ చేశారు. రిజిష్టర్లు, రికార్డులను, తరగతి గదులను పరిశీలించారు. కస్తూర్బా పాఠశాల, మోడల్‌ స్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యత ప్రమాణలపై భోజన నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత తప్పకుండా సాధించాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచించారు. మోడల్‌ స్కూల్లో గతంలో కనిపించకుండా పోయిన ల్యాప్‌టాప్‌లపై విచారణ జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement