ప్రణాళికతో గ్రామ పంచాయతీల అభివృద్ధి
కర్నూలు(అర్బన్): ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధనకు అనుగుణంగా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా పరిష త్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో గ్రామ పంచాయతీ అభివృద్ధిపై జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు ఒక రోజు శిక్షణా కార్యక్ర మం నిర్వహించా రు. ఏపీఎస్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాసరరెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో ప్రజలు నేరుగా పాల్గొనే అవకాశాన్ని మన భారత రాజ్యాంగం కల్పించిందన్నా రు.అందుకు అనుగుణంగానే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు స్వయం ప్రతిపత్తి, చట్టబద్ధతను కల్పించి స్థానిక ప్రభుత్వాలుగా తీర్చిదిద్దారన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల అభివృద్ధికి తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు. పేదరికాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రణాళికల ద్వారా గ్రామ పంచాయతీలు సాధించిన ప్రగతిని ప్రతి సంవత్సరం పంచాయతీ పురోగతి సూచి 2.0 ద్వారా తెలియ జేస్తామన్నారు. కార్యక్రమంలో ఆదోని డీఎల్‌డీఓ బాల క్రిష్ణారెడ్డి, కర్నూలు, ఆదోని డీఎల్‌పీఓలు టి. లక్ష్మి, తిమ్మక్క, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, సీనియర్ సహాయకులు వేణుగోపాల్, టీఓటీలు డి.శేషన్న, ఎస్.ఆస్రఫ్‌బాషా, పి.జగన్నాథం, కె.జ్యోతి పాల్గొన్నారు.


