క్రమశిక్షణతో మెలగాలి | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతో మెలగాలి

Feb 20 2026 6:33 AM | Updated on Feb 20 2026 6:33 AM

క్రమశ

క్రమశిక్షణతో మెలగాలి

పత్తికొండ: విధి నిర్వహణలో హోంగార్డులు క్రమశిక్షణతో మెలగాలని రామలసీమ రేంజ్‌ సదరన్‌ హోంగార్డు కమాండెంట్‌ మహేష్‌కుమార్‌ అన్నారు. గురువారం పట్టణంలోని గోపాల్‌ ప్లాజాలో ఆదోని, పత్తికొండ సబ్‌ డివిజన్‌ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో సఖ్యతగా ఉంటూ అసాంఘిక కార్యకలపాలపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే సేవా గుణంతో పని చేయాలని అప్పడే పోలీస్‌శాఖలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆదోని, పత్తికొండ డివిజన్‌ ప్రాంతం విస్తరించి ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో నేరాలు అదుపునకు కృషి చేయాలని చెప్పారు.

పత్తికొండ వాసికి

ఏఎస్‌పీగా పదోన్నతి

పత్తికొండ రూరల్‌: పత్తికొండకు చెందిన మాచినేని నవీన్‌ యాదవ్‌కు గురువారం ఐటీబీపీ డిప్యుటీ కమాండెంట్‌ (ఏఎస్‌పీ)గా పదోన్నతి లభించింది. గత కొన్నేళ్ల నుంచి ఈయన అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పనిచేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేశారు. ఆతరువాత ఛత్తీస్‌ఘడ్‌ నక్సలైట్స్‌ ఏరివేత కార్యక్రమాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. చండీఘడ్‌లో బేసిక్‌ ట్రైనింగ్‌ కాలేజీలో పనిచేస్తున్న ఆయన డిప్యుటీ కమాండెంట్‌గా పదోన్నతి పొందారు. ఆశాఖ ఉన్నతాధికారులు నవీన్‌కు మెడల్స్‌తో పాటు పదోన్నతి పత్రాలను అందజేశారు. నవీన్‌కు పదోన్నతి లభించడం పట్ల తల్లిదండ్రులు రిటైర్డ్‌ డిప్యుటీ పారామెడికల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు దంపతులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

క్రమశిక్షణతో మెలగాలి 1
1/1

క్రమశిక్షణతో మెలగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement