బాబు పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరం | - | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరం

Feb 20 2026 6:33 AM | Updated on Feb 20 2026 6:33 AM

బాబు పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరం

బాబు పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరం

కర్నూలు(టౌన్‌): చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు వంగాల భరత్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన మూడో రాష్ట్ర బడ్జెట్‌లోనూ వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులు రూ.53,752 కోట్లు అని ఇందులో విద్యుత్‌ సబ్సిడీ రూ.13,752 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణతో పాటు పోలవరంతో కలుపుకొని రూ.14, 277 కోట్లు కేటాయించారన్నారు. విత్తన సబ్సిడీకి రూ. 240 కోట్లు, యంత్రీకరణకు కేవలం రూ. 139. 65 కోట్లు మా త్రమే కేటాయించారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల సరాసరి కన్నా తక్కువ కేటాయింపులన్నారు. రాష్ట్రంలో రెండు ఖరీఫ్‌లు పూర్తి అయ్యే నాటికి సరాసరి సాగు గత ఐదేళ్ల తో పోల్చితే 8 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందన్నారు. ఉచిత ఇన్సూరెన్స్‌ ఎత్తేయడంతో పంటలు దెబ్బతిన్న రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ బడ్జెట్‌లో సున్నా వడ్డీ రాయితీ రూ.250 కోట్లకే పరిమితమయ్యిందన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో సంవత్సరానికి రూ. 20 వేలు పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. సంక్షో భంలో ఉన్న రైతులను ఆదుకున్న దాఖలాలు కనిపించకపోవడం దారుణమన్నారు.

వ్యవసాయ బడ్జెట్‌లో రైతుకు

భరోసా.. ఏది.?

వైఎస్సార్‌సీపీ రైతు విభాగం

రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు

వంగాల భరత్‌ కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement