శ్రీశైలంలో మద్యం, సారా పట్టివేత
శ్రీశైలం: స్థానిక కొత్తపేట, మేకలబండ ప్రాంతాల్లో శుక్రవారం ఎకై ్సజ్ పోలీసుల తనిఖీల్లో 85 మద్యం బాటిళ్లు, 34 లీటర్ల నాటు సారా పట్టుబడింది. సీఐ మోహన్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడులు చేసి మేకల బండకు చెందిన పోతుల సాయి దగ్గర నుంచి 34 లీటర్ల నాటు సారా, అదే ప్రాంతానికి చెందిన నాగరాజు నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలోని కొత్తపేటలో మంజుల లలిత ఇంటి వద్ద 45 మద్యం సీసాలు, అదే ప్రాంతానికి చెందిన సంపంగి మహేశ్వరి వద్ద నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నలు గురు నిందితులపై దేవదాయ చట్ట ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు.
ఘాట్ రోడ్డులో
నిబంధనలు పాటించాలి
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం మీదుగా ప్రయాణించే వాహనదారులు అటవీ సంరక్షణ నిబంధనలు పాటించాలని సబ్ డీఎఫ్‌ఓ బబిత శుక్రవారం తెలిపారు. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాల వేల అధిక సంఖ్యలో భక్తులు వాహనాల్లో వెళ్తున్నారని, ఈ మేరకు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు అందజేస్తున్నామన్నారు. అటవీ మార్గంలో 30 కి.మీ వేగానికి మించి వెళ్ల వద్దని, రహదారిపై వన్యప్రాణులు కనిపిస్తే వాహనాలను నిలిపేయాలని సూచించారు. తీవ్రంగా హారన్‌లు మోగించడం, అడవిలో మల విసర్జనకు వెళ్లడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. అటవీ చట్టాలను అతిక్రమించే డ్రైవర్లకు రూ.500 – రూ.1000 వరకు అపరాధ రుసుం విధిస్తామన్నారు.
చైన్‌స్నాచర్‌కు
మహిళ దేహశుద్ధి
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలో చైన్‌స్నాచింగ్‌కు యత్నించిన దొంగకు మహిళ దేహాశుద్ధి చేశారు. కూరగాయల మార్కెట్ రోడ్డులో షరాఫ్ బజారు నుంచి వస్తున్న ఓ మహిళ మెడ నుంచి చైన్ లాక్కునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా వెంటనే తేరుకున్న మహిళ ఆ వ్యక్తి చేయిపట్టుకుంది. చొక్కా పట్టుకొని దేహాశుద్ధి చేసింది. పోలీస్‌స్టేషన్‌కు లాక్కెళ్తుండగా కొంత దూరం వెళ్లిన తర్వాత మహిళ నుంచి తప్పించుకొని దొంగ పారిపోయాడు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఆదోని అర్బన్: స్థల వివాదం నేపథ్యంలో ఓ మహిళను ధూషించిన వ్యక్తులపై ఆదోని త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామలింగమయ్య శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. స్థానిక దుర్గా రైస్ మిల్ సమీపంలో ఎరుకల జయమ్మకు 7.50 సెంట్ల స్థలం ఉంది. ఆమె తన స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంది. బుధ వారం రాత్రి ఆదోని పట్టణానికి చెందిన మహమ్మద్, ఎస్‌ఎండీ ఇసాక్ మరి కొంతమందితో కలిసి అక్కడికి చేరుకుని ప్రొక్లెన్‌తో కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారు. అడ్డుకోబోయిన జయమ్మ ను కులం పేరుతో దూషిస్తూ అవమానించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ధూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
శ్రీశైలంలో మద్యం, సారా పట్టివేత
శ్రీశైలంలో మద్యం, సారా పట్టివేత


