వెంకటాపురంలో దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

వెంకటాపురంలో దొంగల హల్‌చల్‌

Feb 14 2026 8:10 AM | Updated on Feb 14 2026 8:10 AM

వెంకటాపురంలో దొంగల హల్‌చల్‌

వెంకటాపురంలో దొంగల హల్‌చల్‌

● ఐదు ఇళ్లల్లో చోరీ ● భయాందోళనలో ప్రజలు

శిరివెళ్ల: వెంకటాపురంలో దొంగలు రెచ్చిపోయారు. గురువారం అర్ధరాత్రి ఐదు ఇళ్లల్లో చొరబడి దొరికిందంతా దోచుకెళ్లారు. దాదాపు రూ. లక్ష నగదు, రూ. 80 వేలు విలువ చేసే బంగారు కమ్మలు, ముక్కు పుడకలు చోరీకి గురయ్యాయి. ముందుగా శ్రీరామ వెంకటేశ్వర్లు ఇంటిలో దొంగలు చొరబడి బీరువాను బయటకు తెచ్చి ఇంటి సమీపంలోని ఓ దిబ్బ వద్ద పగల గొట్టారు. శబ్ధం విన్న ఇంటి యాజమాని, చుట్టు పక్కల వాళ్లు రాగా దొంగలు పరారయ్యారు. అలాగే రిటైర్డ్‌ వీఆర్వో అనందయ్య ఇంటిలో బీరువాలోని బంగారు కమ్మలు, ముక్కు పుడకలు అపహరించారు. గుడి నరసింహ ఇంటిలో బీరువాలోని రూ. 80 వేలు నగదును చోరీ చేశారు. వలివేటి శేషగిరి ఇంటిలో ప్రవేశించి రూ. 20 వేల నగదును ఎత్తు కెళ్లారు. అలాగే పొదిలి చిన్న కేశయ్య టీ కొట్టులో తినుబండారాలు తిని, కూల్‌ డ్రింక్స్‌ తాగారు. ఈ చోరీలకు పాల్పడిన వారిలో నలుగురు ముఖాలకు ముసుగు వేసుకోగా, ఒకరు ఖర్చీఫ్‌ కట్టుకుని హిందీలో మాట్లాడుకుంటున్నారని ఇద్దరు మహి ళలు గుర్తించినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ రాము గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. గతంలో గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి గుడిలో స్వామి వారి వెండి ఆభరణాలు దుండగులు అపహరించారు. గ్రామంలో వరుస దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement