జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. ఓం నమఃశివాయ, హరోం హర శంకరా అంటూ భక్తులు స్వామి, అమ్మవార | - | Sakshi
Sakshi News home page

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. ఓం నమఃశివాయ, హరోం హర శంకరా అంటూ భక్తులు స్వామి, అమ్మవార

Feb 14 2026 8:09 AM | Updated on Feb 14 2026 8:09 AM

జ్యోత

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మో

శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

అరకొర ఏర్పాట్లతో అవస్థలు

పుష్ప పల్లకీలో విహరిస్తున్న ఆది దంపతులు

మహిళ కోలాటం

పుష్పపల్లకీలో ఆదిదంపతులు

బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం శ్రీ భ్రమరాంబసమేత మల్లికార్జునుడు పుష్పపల్లకీపై దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. క్షేత్ర తూర్పు, దక్షిణ మాడవీధుల్లో జరిగిన పుష్పపల్లకీ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. పుష్పపల్లకీని వివిధ రకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పల్లకీలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేశారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు ప్రత్యేక పూజా హారతులిచ్చారు. గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం మీదుగా రాజగోపురం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, మేళతాళాలు, శంఖానాదాల మధ్య గ్రామోత్సవం నేత్రానందభరితంగా సాగింది. పూజా కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీశైలం నేడు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శనివారం సాయంత్రం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ ఉంటుంది. పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు.

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మో1
1/3

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మో

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మో2
2/3

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మో

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మో3
3/3

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement