కాలుష్య నియంత్రణ చట్టాన్ని పాటించాలి
కర్నూలు: పారిశ్రామికవర్గాలు కాలుష్య నియంత్రణ చట్టాన్ని తూచా తప్పకుండా పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. కర్నూలు వెంకటరమణ కాలనీలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో శనివారం పర్యావరణ ఇంజినీర్ పీవీ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేటు హాస్పిటల్స్, పరిశ్రమల అధికారులతో పర్యావరణ పరిరక్షణపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలా వెంకటశేషాద్రి హాజరై మాట్లాడారు. కాలుష్య నివారణ చట్టం ప్రకారం ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యం నుంచి గాలి నాణ్యతను మెరుగుపర్చడం, కా లుష్యాన్ని నివారించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమ న్నారు. అలాగే నీటి కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం పరిశ్రమలు, ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాల వల్ల నీటి కాలుష్యాన్ని నివారించడం, నీటి నాణ్యతను కాపాడటం ముఖ్య ఉద్దేశమన్నారు. పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ప్రమాణాలను పారిశ్రామిక వర్గాలు పాటించాలన్నారు. పర్యావరణ ఇంజనీర్ పీవీ కిషోర్ రెడ్డి, జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక అధికారి డేనియల్, అసిస్టెంట్ పర్యావరణ ఇంజినీర్ వెంకట సాయికిషోర్, అనలిస్ట్ ఇమ్రాన్, రామ కృష్ణ, పవన్, టీజీవీ ఆల్కాలీస్, రాయలసీమ పరిశ్రమల యజమానులు, దాల్మియా, ద్రోణాచలం ప్రియ, శ్రీజయజ్యోతి, జేఎస్‌డబ్ల్యూ, రామ్‌కో సిమెంటు కంపెనీల యజమానులు, జైరాజ్ స్టీల్ కంపెనీ, మెడికవర్, అమీలియో, శ్రీచక్ర, జెమ్‌కేర్ కామినేని, ఓమినీ హాస్పిటల్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


