
మట్కా జోరు!
● కర్ణాటక తీర నియోజకవర్గాల్లో
విచ్చలవిడిగా జూదం
● మంత్రాలయంలో
చాపకింద నీరులా మట్కా
● పచ్చని పల్లెల్లో మట్కా మరకలు
● రోజుకు రూ.లక్షల్లో బీట్
24.05.2025న
కోసిగి మండల కేంద్రానికి చెందిన ముగ్గురు బీటర్లు మట్కా ఆడుతూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.3,100 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోసిగి మండల కేంద్రానికి చెందిన కురువ లింగారెడ్డి, పులుసు వీరేష్, హనుమంతుపై కేసు నమోదు చేయడం జరిగింది.
25.07.2025న
కోసిగి మండలం కోల్మాన్‌పేటలో మరో ముగ్గురు మట్కా బీట్ రాస్తూ పోలీసులకు దొరికిపోయారు. వారి నుంచి రూ. 4,120, సెల్‌ఫోన్లు స్వాధీన పరుచుకున్నారు. కోల్మాన్‌పేటకు చెందిన గిరిస్వామి, కృష్ణ, ఆంజనేయులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
20.09.2025న
మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని రచ్చమర్రి గ్రామంలో మట్కా నిర్వాహకులపై దాడులు చేశారు. గ్రామానికి చెందిన మట్కా బీటర్లు పింజరి నవాబ్, బోయ
మజ్జిన ఈరన్న, బోయ నర్సిరెడ్డి జమ్మి మరుసు దగ్గర మట్కా రాస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.38,450 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికీ ఆ గ్రామం మట్కాకు కేంద్రమన్నది బహిరంగ రహస్యం.