
కమనీయం.. ప్రహ్లాదవరదుడి పవిత్రోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందు లో భాగంగా శనివారం తెల్లవారు జామున మూలవిరాట్ శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ప్రత్యేక అర్చనలు, హారతులతో పూజలు చేశారు. అనంతరం పవిత్ర యాగశాలలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వాములను కొలువుంచి నవకలశ స్నపనం, ద్వారతోరణ పూజ, మండల ప్రతిష్ట, కుంభ ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర హోమం నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుంచి మంగళ వాయిద్యాల మధ్య మాడ వీధుల్లో గ్రామోత్సవం చేపట్టారు.

కమనీయం.. ప్రహ్లాదవరదుడి పవిత్రోత్సవం