
పీజీ ఇన్ సర్వీస్ ఇవ్వాలి
పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులకు గత పీజీ కోటానే పునరుద్ధరించాలి. అలాగే గత సంవత్సరం సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్)గా విధుల్లో చేరిన వారికి కూడా పీజీ ఇన్ సర్వీస్ ఇవ్వాలి. 15 ఏళ్లకు మించి సీఏఎస్‌గా ఉన్న వారికి టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలి. ట్రైబల్‌లో పనిచేస్తున్న వైద్యులకు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన అలవెన్సులు ఇవ్వాలి. అప్పటి వరకు మేం మా పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –డాక్టర్ ఆర్. విజయభాస్కర్,
జనరల్ సెక్రటరీ, ఏపీ పీహెచ్‌సీ డాక్టర్స్
అసోసియేషన్, కర్నూలు జిల్లా
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.2,700కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి 8 నెలలుగా బిల్లులు ప్రాసెస్ కావడం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రావడం లేదు. మరోవైపు 15 ఏళ్ల క్రితం నాటి ప్యాకేజీలే ఇప్పుడు ఉన్నాయి. ధరలు పెరగడం వల్ల ఆసుపత్రుల నిర్వహణ కష్టమైంది. ఈ పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాల్సి వచ్చింది. మేం చర్చలకు రావాలంటే ముందుగా క్లియరెన్స్‌లో ఉన్న రూ.2,700కోట్లు తక్షణం విడుదల చేయాలి. మిగిలిన మొత్తం ఎలా ఇస్తారో హామీ ఇవ్వాలి. త్వరలో ప్రారంభించనున్న యూనివర్శల్ హెల్త్ ప్యాకేజీ విధి విధానాల్లో ప్రైవేటు ఆసుపత్రులను భాగస్వామ్యం చేయాలి. – డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్, ఏపీ ప్రైవేటు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, జిల్లా కార్యదర్శి

పీజీ ఇన్ సర్వీస్ ఇవ్వాలి