
నాణ్యత ‘తెల్ల’బోయి!
కోడుమూరు రూరల్: ఈ ఏడాది పత్తి పంట సాగు చేసినప్పటి నుంచి రైతులకు వరుణదేవుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇప్పటికే అధిక వర్షాలకు నియోజకవర్గంలో పత్తి పంట భారీగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల వరుణదేవుడు కొంత తెరిపి ఇచ్చాడు. దీంతో రైతులు ఉన్న కాస్తా పత్తి దిగుబడులను తీసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెలవారుజామున వరకు కురిసిన వర్షాలకు చెట్ల మీద ఉన్న పత్తి అంతా తడిసిపోయింది. దీంతో చేతికొచ్చిన పత్తి తెంపకుండానే చెట్లపై తడిసి మద్దవ్వడంతో పత్తి నాణ్యత దెబ్బతింటుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే ప్రస్తుతం కురుస్తున్న వ ర్షాలకు సజ్జ పంట కూడా దెబ్బతినే ప్రమాదం నెలకొందని రైతులు వాపోతున్నారు