
శ్రీనివాసరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
తుగ్గలి: వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, దివంగత మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి చిన్న కుమారుడు తుగ్గలి శ్రీనివాసరెడ్డి కంటి సమస్యతో బాధపడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఆయనను ఫోన్‌లో పరామర్శించారు. కంటి చికిత్సపై ఆరా తీసి, ఆరోగ్యం బాగా చూసుకోవాలని సూచించినట్లు శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రీశైల దేవస్థాన నూతన ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ధర్మకర్తల సలహా మండలిని నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17 మందితో కూడిన ధర్మకర్తల సలహా మండలిని నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దేవదాయ ధర్మదాయ చట్టాన్ని అనుసరించి రెండేళ్ల కాలపరిమితితో ఈ నూతన ధర్మకర్తల సలహా మండలి ఉంటుంది. సభ్యులుగా పోతుగంటి రమేష్ నాయుడు, ఏ.వి.రమణ, బి.రవణమ్మ, చిట్బిట్ల భరదద్వాజ శర్మ, జి.లక్ష్మీశ్వరి, గుల్లా గంగమ్మ, కె.వర్ధిని, ఎస్.పిచ్చయ్య, జె.రేఖాగౌడ్, ఏ.అనిల్‌కుమార్, దేవకి వెంకటేశ్వర్లు, బి.వెంకటసుబ్బారావు, సి.కాశీనాథ్, ఎం.మురళీధర్, యు .సుబ్బలక్ష్మీ, పి.యు. శివమ్మ, జి.శ్రీదేవిలను శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల సలహా మండలి సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థాన సీనియర్ అర్చకులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమిస్తారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులు ప్రమాణస్వీకారం అనంతరం సమావేశమై చైర్మన్‌ని ఎన్నుకుంటారు.
రోడ్డు ప్రమాదంలో లస్కర్ మృతి
కౌతాళం/ఆదోని రూరల్: తుంగభద్ర దిగువ కాల్వ పరిధిలో కౌతాళం సెక్షన్‌లో లస్కర్‌గా పని చేసే తిరుపాల్ (46) శుక్రవారం సాయంత్రం ఆదోని మండలం ఆరెకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్య సుమలత, కుమారుడు విక్రమ్‌తేజాతో కలిసి ఆరెకల్లు పరిసరాల్లోని పార్క్‌కు పోయి తిరిగి వస్తుండగా లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీ కొట్టింది. దీంతో తిరుపాల్ అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు తేజ, భార్య సుమలతకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తిరుపాల్ మృతి పట్ల ఈఈ పాండురంగయ్య, డీఈ షఫీవుల్లా, ఏఈ ఈశ్వర్‌లు సంతాపాన్ని తెలిపారు.
చైల్డ్ వెల్ఫేర్ చెంతకు బాలుడు
ఎమ్మిగనూరురూరల్: అమ్మ, నాన్నను కోల్పో యి అనాథగా మిగిలిని బాలుడు చైల్డ్ వెల్ఫేర్ చెంతకు చేరాడు. సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. దెవందిన్నె గ్రామానికి చెందిన నాగరాజు, ఎల్లమ్మల కుమారుడు ప్రసన్నరాజు 9వ తరగతి వరకు చదువుతూ మధ్యలో మానేసి కూలీ పనులకు వెళ్లేవాడు. తండ్రి నాగరాజు చనిపోవడం, పక్షవాతంతో మంచం పట్టిన తల్లి ఎల్లమ్మకు అన్ని తానై కుమారుడు ప్రసన్నరాజు సేవలు అందిస్తున్న వైనాన్ని గత నెల 23వ తేదీన సాక్షిలో ‘అమ్మకు కుమారుడు లాలి’ కథనం ప్రచురితమైంది. ఈ కథనం ప్రచురితమైన రోజుల వ్యవధిలో బాలుడి తల్లి ఎల్లమ్మ కూడా మృతి చెందటంతో బాలుడు ప్రసన్నరాజు అనాథగా మిగిలాడు. అప్పటికే ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఐసీడీఎస్ పీడీ విజయ స్పందిస్తూ బాలుడి పరిస్థితిపై విచారణ చేయాలని ఎమ్మిగనూరు ఐసీడీఎస్ సీడీపీఓ సఫర్నీసాబేగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆమె గ్రామానికి వెళ్లి బాలుడి పరిస్థితిని ఆరా తీయగా ఇటీవల తల్లి కూడా మరణించినట్లు తెలుసుకున్నారు. బాలుడితో మాట్లాడి చదువుపై ఆసక్తి ఉన్న విషయాన్ని ఆమె పీడీకి వివరించారు. దీంతో కర్నూలులో చైల్డ్ వెల్ఫెర్ ప్రొటెక్షన్ కమిటీకి అప్పగించాలని పీడీ ఆదేశించించారు. ఈ మేరకు శుక్రవారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వయోల ప్రీతి బాలుడి ని తీసుకొని కర్నూలులోని చైల్డ్ వెల్ఫ్‌ర్ ప్రొటెక్షన్ కమిటీకి అప్పగించారు. దసరా సెలవులు రావటం, చనిపోయిన బాలుడు తల్లి అంత్యక్రియల కార్యక్రమాలు ఉండటంతో బాలుడి అప్పగింత కొంత ఆలస్యమైందని తెలిపారు.

శ్రీనివాసరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ

శ్రీనివాసరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ