
అనారోగ్యంతో ఇద్దరు మాజీ సైనికుల మృతి
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు మాజీ సైనికులు అనారోగ్యంతో మృతి చెందినట్లు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నంద్యాల ఎన్‌జీఓ కాలనీలో నివాసం ఉంటు ఎస్‌బీఐలో ఉద్యోగం చేస్తున్న శశికుమార్ (55) గుండెపోటుతో మృతి చెందారన్నారు. ఈయన మద్రాసు 28 రెజిమెంట్‌లో నాయక్ ర్యాంక్‌లో 20 సంవత్సరాలు విధులు నిర్వహించారన్నారు. అలాగే ... కర్నూలు మాధవీనగర్ మహావీర్ కాలనీలో నివాసం ఉంటున్న నాయక్ వి. దేవదానం కూడా అనారోగ్యంతో మృతి చెందారన్నారు. ఈయన మద్రాస్ రెజిమెంట్ 5లో 17 ఏళ్లు విధులు నిర్వహించారన్నారు. మృతి చెందిన ఇద్దరు మాజీ సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. వీరి కుటుంబ సభ్యులకు సంఘం ఎల్లప్పడు అండగా ఉంటుందని తెలిపారు.