
పనుల్లేక.. చెట్టు కింద ఆట!
చేద్దామంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు లేవు.. మోస్తరుగా వర్షాలు కురుస్తుండటంతో సేద్యాలు సాగడం లేదు.. పొలాల్లో కలుపు తీయడానికి, విత్తనం వేయడానికి ఎవరూ పిలవడం లేదు. దీంతో తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో శుక్రవారం రైతులు, వ్యవసాయ కూలీలు ఓ చెట్టు కింద చేరి ‘పులి–మేక’ ఆటతో కాలక్షేపం చేస్తూ కనిపించారు. పులి నుంచి మేకలను ఎలా కాపాడాలో.. పులిని ఎలా బంధించాలో చాలా తెలివిగా ఆట ఆడారు. బాలులు, యువకులు సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారని, వారు ఇలాంటి ఆటలు ఆడి జ్ఞానాన్ని పొందవచ్చని గ్రామ పెద్దలు తెలిపారు. పాలన సరిగ్గా లేని సమయంలో పాలకుల ఆట ఎలా కట్టించవచ్చో కూడా ఆలోచనలు వస్తాయని చెప్పారు. – తుగ్గలి