
శ్రీమఠానికి నీటిశుద్ధి ప్లాంట్ విరాళం
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నీటి శుద్ధి ప్లాంట్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అందజేశారు. శుక్రవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు చేతుల మీదుగా పూజలు చేసి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్‌కు రాఘవేంద్ర జల ప్రసాద అనే పేరు పెట్టారు. ఎల్‌ఐసీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్‌ను అంక్షితలు వేసి శ్రీమఠం పీఠాధిపతి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మఠం అధికారులు, ఎల్‌ఐసీ అధికారులు పాల్గొన్నారు.