
208 రైతు సేవా కేంద్రాల మూత
‘మయూర’ నాట్యం
నల్లమల అడవుల నుంచి వచ్చిన నెమళ్లు శుక్రవారం కర్నూలు జొహరాపురంలోని క్రికెట్ స్టేడియంలో సందడి చేశాయి. అటూ ఇటూ తిరుగుతూ పురి విప్పి నాట్యమాడుతూ కనువిందు చేశాయి. జాతీయ పక్షులను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
పురి విప్పిన నెమలి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 208 రైతు సేవా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. నంద్యాల జిల్లాలో 411 ఉండగా రేషనలైజేషన్ కారణంగా 294కు తగ్గిపోయాయి. మొత్తం 117 రైతు సేవా కేంద్రాలు మూతపడ్డాయి. కర్నూలు జిల్లాలో 466 ఉండగా రేషనలైజేషన్ ప్రక్రియతో 71 మూతపడి 395 మిగిలాయి. అస్తవ్యస్త బదిలీల కారణంగా వీఏఏలు లేక మరో 20కిపైగా మూతపడిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మ్తొతం రైతు సేవా కేంద్రాల 877 నుంచి 669కి తగ్గిపోయాయి. నంద్యాల జిల్లాలో ఎక్కువగా ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులను (వీఏఏలను) కర్నూలు జిల్లాలోని ఆదోని, పెద్దకడుబూరు, కోసిగి, ఆలూరు, చిప్పగిరి వంటి మండలాలకు బదిలీ చేశారు. బదిలీల్లో సీనియారిటీని పట్టించుకోకపోవడం, స్పౌజ్ ఇతర ప్రత్యేక కేటగిరీలను నిర్లక్ష్యం చేయడం, టీడీపీ నాయకుల సిఫార్సు లేఖలకు, ముడుపులకు పెద్దపీట వేయడం తదితర కారణాలతో పలువురు వీఏఏలు హైకోర్టును ఆశ్రయించారు. యథాస్థితిని కొసాగించాలని హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ రావడంతో వీఏఏలు అంతకు ముందు పనిచేస్తున్న రైతు సేవా కేంద్రాల్లోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడం, ఎరువులు, విత్తనాల అవసరం రావడం, రైతు సేవా కేంద్రాలు మూతపడి ఉండటంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

208 రైతు సేవా కేంద్రాల మూత