
న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలి
కర్నూలు(సెంట్రల్): న్యాయవాదులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం తేవాలని ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ అసోసియేషన్(ఐఎల్‌ఏ) డిమాండ్ చేసింది. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బార్ అసోసియేషన్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బార్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ పి.రవిగువేరా, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ఐఎల్‌ఏ జిల్లా నాయకులు బి.చంద్రుడు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సుబ్బయ్య, ఓంకార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్‌ను రూ.6లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాలన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటు రూ.4 లక్షలు ఉండాలన్నారు. న్యాయవాదులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచాలన్నారు.అంతేకాక న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రంగనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బీఎస్ రవికాంత్‌ప్రసాదు, కోశాధికారి పి.దస్తగిరి, జిల్లా ఉపాధ్యక్షులు షఫీ పాల్గొన్నారు.
ఐఎల్‌ఎల్ డిమాండ్