
శుభ ముహూర్తాలు
ఈ నెలలో 26, 30, 31 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల 31వ తేదీన పెద్ద ముహూర్తం కావడంతో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 18, 14, 17 తేదీల్లో ముహూర్తాలున్నాయి. అలాగే, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకూ భాద్రపదమాసం. ఇది శూన్యమాసం కావడంతో ముహూర్తాలు లేవు.
వ్రతాల వెనుక ఆరోగ్య రహస్యాలు
వరలక్ష్మి వ్రతం రోజు వాయనంగా ఇచ్చే మొలకెత్తిన శనగలు పోషక నిలయాలు. వీటిలో మాంసకృతులు తక్షణ శక్తిని ఇస్తాయి. నైవేద్యంగా ఆరగించే చలివిడి పండి చలువ చేస్తుంది. చలివిడి గర్భాధారణ అవరోధాలను తొలగిస్తుంది. అలాగే వర్షకాలం పాదాలు ఎక్కువ సేపు తడిగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ కలుగుతుంటాయి. ఇలా ఇన్ఫెక్షన్‌కు గురవ్వకుండా ఉండటం కోసమే కాళ్లకు పసుపు పూసుకోవటాన్ని ఈ వ్రతాల్లో భాగం చేస్తారు. ఆవు నెయ్యితో వెలిగించే దీపాల ద్వారా విడుదలయ్యే ధూపం వాయు కాలుష్యాన్ని హరిస్తుంది.

శుభ ముహూర్తాలు