
వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు
ఆలూరు రూరల్: హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న టీడీపీలో కొనసాగలేమంటూ ఆలూరు మండలం కొట్టాల గ్రామానికి చెందిన నాయకులు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. చిప్పగిరిలోని తన నివాసంలో వీరికి ఎమ్మెల్యే విరూపాక్షి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడు రామాంజినేయులు, అలాగే 15 మంది నాయకులు, వారి అనుయాయులు వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. టీడీపీలో ఎన్నో ఏళ్లుగా సేవలందించినా ప్రయోజనం లేకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. కార్యక్రమంలో ఆర్టీఐ వింగ్ జిల్లా ఉపాధ్యాక్షుడు కొట్టాల రాజు, ప్రసాద్, ఆంజినేయ, గోవిందరాజులు, నారాయణ పాల్గొన్నారు.