
‘షాక్’ ఇచ్చారు ఇలా..
● మొదట 33కేవీ ఫీడర్లు, 11 కేవీ ఫీడర్లు, నాన్ అగ్రికల్చర్ కనెక్ణ్(డీటీఆర్), ప్రభుత్వ సర్వీస్‌లు, ఇండస్ట్రియల్, కమర్షియల్ కనెక్షన్‌లకు విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు బిగించింది.
● కొద్ది రోజులుగా 200 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగిస్తున్న గృహ కనెక్షన్‌లకు కూడా బిగిస్తున్నారు.
● మొత్తం 1,57,263 స్మార్ట్ మీటర్లు బిగించాలని తలపెట్టగా.. ఇప్పటికే 70,355 బిగించారు.
● 200 యూనిట్ల పైబడి వినియోగం ఉన్న 42,158 ఇళ్లకు స్మార్ట్ మీటర్ల బిగించాల్సి ఉండగా ఇప్పటి వరకు 51,14 బిగించారు.
● కర్నూలు డివిజన్‌లో 3,152, ఆదోని డివిజన్‌లో 1,519, ఎమ్మిగనూరు డివిజన్‌లో 443 ప్రకారం బిగించారు.
ఇలా చేయవచ్చు..
● స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వినియోగదారులు వ్యతిరేకించవచ్చు.
● మీటర్లు వద్దని చెబుతున్నా...బిగించడానికి ప్రయత్నిస్తే 100 కాల్ చేసి పోలీసుల దృష్టికి తీసుకపోవచ్చు.
● ఇళ్లకు, షాపులకు బిగించడానికి వస్తే వద్దని ధైర్యంగా చెప్పవచ్చు.
● అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించే అధికారం విద్యుత్ శాఖకు లేదు.