
వైభవంగా జయతీర్థుల ఆరాధన
మంత్రాలయం: మధ్వమత పూర్వ పీఠాధిపతి జయతీర్థుల ఆరాధన వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం రాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా వేడుకలు చేపట్టారు. ముందుగా ఊంజల మంటపంలో జయతీర్థుల చిత్ర పటానికి సంప్రదాయ బద్ధమైన పూజలు చేశారు. అనంతరం స్వర్ణ రథంపై చిత్రపటాన్ని కొలువుంచగా పీఠాధిపతి హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. శ్రీమఠం ప్రాంగణంలో రథయాత్ర శోభాయామానంగా జరిగింది. ఆరాధన సందర్భంగా ఊంజల మంటపంలో పండితుల ప్రవచనాలు ఆకట్టుకున్నాయి.
ఆర్‌డబ్ల్యూఎస్ క్యూసీ డీఈఈగా సాయి శశాంక్
కర్నూలు(అర్బన్): గ్రామీ ణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా పి. సాయి శశాంక్ మంగళవా రం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డీఈఈగా విధులు నిర్వ హించిన కుష్‌కుమార్‌రెడ్డి ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో బనగానపల్లె ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న బి.మధుసూదన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఈఎన్‌సీ కార్యాలయంలో ఏఈఈగా విధులు నిర్వహిస్తున్న సాయి శశాంక్‌కు డీఈఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు.
ఉపాధి నిధులతో పండ్లతోటల అభివృద్ధి
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఈ ఏడాది 5వేల ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ట్లు జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 1200 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం పూర్తయిందన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 4,200 ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధికి రైతులను గుర్తించామన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి 2,300 ఎకరాలకు పరిపాలన అనుమతులు లభించాయన్నారు. ఈ ఏడాది కూడా జిల్లాలో 1,200 గోకులాలు నిర్మించేందుకు పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులను గుర్తిస్తున్నట్లు తెలిపారు.
యువత తస్మాత్ జాగ్రత్త
కర్నూలు: నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. నకిలీ ఉద్యోగాలు, ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. రిలయన్స్ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ అని చెప్పి ఓ డిగ్రీ విద్యార్థితో రూ.15 వేలు తీసుకుని మోసం చేశారని, అలాగే మరో కేసులో కెనడాలో ఉద్యోగం పేరుతో రూ.85 వేలు వీసా ఫీజు చెల్లించి ఓ యువకుడు మోసపోయాడనానరు. తరచూ జిల్లాలో మోసం కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. నిజమైన ధ్రువీకరణ లేకుండా ఆన్‌లైన్ ప్రకటన నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయకూడదన్నారు.

వైభవంగా జయతీర్థుల ఆరాధన