
పడిగాపులు కాస్తూ.. కన్నీళ్లతో తిరిగెళ్తూ!
యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. పొలం పనులు వదులుకొని కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం.. వచ్చిన యూరియాను కూటమి నేతలు ఎగరేసుకుపోతుండటంతో రైతులకు ఇక్కట్లు తప్పని పరిస్థితి. మంగళవారం మండలంలోని పెద్దహరివాణం, సంతెకూడ్లూరు, బసాపురం గ్రామాలకు చెందిన దాదాపు 60 మందికి పైగా రైతులు యూరియా కోసం ఆదోని మండల వ్యవసాయ కార్యాలయం, కేడీసీఎంఎస్ పాయింట్ వద్ద పడిగాపులు కాశారు. మధ్యాహ్నం 1 గంట వరకు కార్యాలయాల వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడం చూస్తే ఈ ప్రభుత్వంలో రైతుల దుస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఆ తర్వాత కూడా అరకొర యూరియా కొంత మంది రైతులకు పంపిణీ చేయడం గమనార్హం. మిగిలిన రైతులంతా నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
– ఆదోని రూరల్