కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక కోలాహలంగా సాగింది. మూడేళ్లకు ఒకసారి సాగాల్సిన అసోసియేషన్ ఎన్నికలు తొమ్మిదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఈఎస్‌టీఎఫ్ సీఐ కేఆర్ రాజేంద్రప్రసాద్ వ్యవహరించారు. కర్నూలు ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఎర్రల వెంకట గిరిబాబు పూర్వపు అధ్యక్షుడు ఓబులేసుపై 86 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొత్తం 207 మంది ఓటింగ్‌లో పాల్గొనగా, గిరిబాబుకు 146, ఓబులేసుకు 60 ఓట్లు రాగా, ఒక ఓటు చెల్లలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 ఎకై ్సజ్ స్టేషన్లు, నంద్యాల కర్నూలు పీఎస్ కార్యాలయాలు, ఈఎస్‌టీఎఫ్, మోబైల్ పార్టీ, చెక్‌పోస్టులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఓటింగ్‌లో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే అసోసియేట్ అధ్యక్షులుగా ఎస్‌ఆర్ అబ్దుల్‌మాలిక్, ఉపాధ్యక్షులుగా బలరాముడు, పీ విరుపాక్షిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా విజయ్‌కుమార్, ఆర్టనైజింగ్ కార్యదర్శిగా జయచంద్రుడు, సహాయ కార్యదర్శులుగా నక్కా సుధాకర్, పాలొళ్ల జగదీష్, ప్రెస్ సెక్రెటరీలుగా కేసీ శ్రీనివాసులు, డీ దస్తగిరి, కోశాధికారిగా కల్పన, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా జీ రాణి, ఎం రవికుమార్, కే వెంకటరాముడు, డీ చిన్న అల్లస్వామి ఎన్నికయ్యారు.
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా
గిరిబాబు, విజయ్‌కుమార్