అవిశ్వాస తీర్మానం | - | Sakshi
Sakshi News home page

అవిశ్వాస తీర్మానం

Mar 20 2025 1:52 AM | Updated on Mar 20 2025 1:49 AM

ఆదోని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌పై

కర్నూలు(సెంట్రల్‌): ఆదోని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బోయ శాంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికై నా కౌన్సిలర్ల మాటకు విలువ ఇవ్వకుండా విశ్వాసం కోల్పోయారని, ఆమైపె అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వా లని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లు కలెక్టర్‌ను కలిశారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పి.రంజిత్‌బాషాను ఆయన చాంబర్‌లో కలసి 35 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేసిన లేఖను అందజేశారు. ఈ లేఖపై కలెక్టర్‌ 15 రోజుల్లో విచారణ జరిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేకంగా మునిసిపల్‌ససర్వసభ్య సమావే శా న్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే నూతన ౖచైర్మన్‌ను ఎన్నుకునే వీలుంటుంది.

కౌన్సిలర్ల మాటకు విలువ లేకుండా చేశారు...

ఆదోని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బోయ శాంత కౌన్సిలర్ల మాటకు విలువ లేకుండా చేయడంతోనే ఆమైపె అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైనట్లు కౌన్సిలర్లు గౌస్‌, రఘునాథఽరెడ్డి, లక్ష్మీదేవి, లోకేశ్వరి, నరసింహులు, సందీప్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ఆమె ఇటీవల బీజేపీలోకి వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్‌ బి.పార్థసారథి మాటలు విని తమ తీర్మానాలను పట్టంచుకోవడంలేదన్నారు. ఇదేసమయంలో ఆదోని ఎమ్మెల్యే అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా, కౌన్సిలర్లపై పెత్తనం చేస్తున్నారని, బలవంతంగా పార్టీ మారాలని ఒత్తిళ్లు చేస్తున్నట్లు వాపోయారు.

బెదిరించి పార్టీ మార్పిస్తున్నారు

అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు వైఎస్‌ఆర్‌సీపీ మునిసిపల్‌ మేయర్లు, చైర్మన్లను దౌర్జన్యంగా బెదిరించి టీడీపీ, బీజేపీ, జనసేనల్లోకి చేర్చుకుంటున్నారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, మేయర్‌ బీవై రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల తిరుపతిలో కనీస బలం లేకుండా డిప్యూటీ మేయర్‌ పోస్టును టీడీపీ కై వసం చేసుకోవడాన్ని చూశామని, అదే తరహాలో ఆదోనిలో కూడా వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లను భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. చైర్‌పర్సన్‌ సహా ఐదుగురు కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. పార్టీ మారిన వారంతా అవిశ్వాసం సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీకే ఓటు వేయాలని, లేదంటే విప్‌ను జారీ చేసి డిస్‌క్వాలిఫై చేస్తామన్నారు.

మొత్తం వార్డులు: 42

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు: 41

టీడీపీ కౌన్సిలర్లు: 01

కలెక్టర్‌కు లేఖను అందించిన 35 మంది వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లు

ఆదోని మున్సిపాలిటీలో పార్టీల బలాబలాలు

(కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చైర్‌పర్సన్‌ సహా ఐదుగురిని బెదిరించి బీజేపీలో చేర్చుకున్నారు. ఒకరు చనిపోయారు. అయినప్పటికీ వైఎస్‌ఆర్‌సీపీకి 35 మంది కౌన్సిలర్ల బలం ఉంది.)

అవిశ్వాస తీర్మానం 1
1/1

అవిశ్వాస తీర్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement