మహిళా పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

మహిళా పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి ప్రణాళిక

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

మహిళా పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి ప్రణాళిక ఎన్నికల విధులకు గైర్హాజరైతే శిక్ష తప్పదు పామర్రు: ఎన్నికల విధులకు గైర్హాజరైతే శిక్ష తప్పదని కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ చెప్పారు. పామర్రు మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఎన్నికల అధికారులతో డ్యూటీ పడిన వారు అందరూ హాజరు అయ్యారా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి కాండ్రు జ్యోతి, పామర్రు, పమిడిముక్కల మండలాల ఎన్నికల ప్రత్యేక అధికారి నీలకంఠేశ్వరరెడ్డి, సహాయ ఎన్నికల అధికారులు, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణాన్ని ఉపసంహరించుకోండి తెలంగాణకు పెద్దపులి

ఇబ్రహీంపట్నం: మహిళా పారిశ్రామిక వేత్తల అభ్యన్నతికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న సూక్ష్మ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసి, విస్తరించేందుకు ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థకు చెందిన లింగ సమానత్వం, సమ్మిళిత నాయకత్వ కేంద్రం ఆధ్వర్యాన గుంటుపల్లి రైజ్‌ కేంద్రంలో ‘వ్యాపార దార్శనికత, అభివృద్ధి’పై ప్రత్యేక శిక్షణ శనివారం నిర్వహించారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న పలువురు మహిళలను కలెక్టర్‌ సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు 130మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): హైదరా బాద్‌–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–65) కంచికచర్ల వద్ద నుంచి ఉన్న రహదారినే విస్తరించకుండా, నక్కలం పేట నుంచి ఇబ్రహీంపట్నం గాజులపేట వరకు కొత్తగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మించాలనే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయనతో పాటు ఆయా గ్రామాల రైతులు, రైతు సంఘాల నాయకులు ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియను ఆమె చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి నిర్మాణంతో జరిగే అనర్థాలను జేసీకి వివరించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంతో 10 గ్రామాలు మున్నేరు, వైరా, కట్లేరు, ఏనుగడ్డ వాగుల వరద ముంపు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణా నదికి వచ్చే వరదలతో అల్లాడిపోతున్న రైతులకు ఇది శాపంగా మారబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి ప్రమాదం కలగవచ్చని ఆందోళన చెందారు.

ప్రజలను సంప్రదించకుండా నిర్మించవద్దు

ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందరావు మాట్లాడుతూ రైతులు, గ్రామ ప్రజలను సంప్రదించకుండా, వారి అభిప్రాయాలు తీసుకో కుండా రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ఇప్పటికే రైల్వే లైన్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాలతో భూములు కోల్పోతున్న రైతులు, ఈ కొత్త రహదారితో మిగిలిన భూములను కోల్పోయి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సహజ నీటి ప్రవాహ మార్గాలను దెబ్బతీసే ఈ రహదారి నిర్మాణాన్ని నిలిపివేసి, పాత జాతీయ రహదారినే విస్తరించే ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. జేసీని కలిసిన వారిలో నక్కలంపేట, పరిటాల, దాములూరు, చిలుకూరు, గనిత్కూరు, కొటికలపూడి తదితర గ్రామాల రైతు నాయకులు ఎన్‌.ఎన్‌.ప్రసాద్‌, మాగంటి లక్ష్మి, చెరుకూరి రామకృష్ణ,నిమ్మగడ్డ లావణ్య, గుదే రాంబాబు తదితరులు ఉన్నారు.

గంపలగూడెం: ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు, తిరువూరు, గంపలగూడెం మండలాల్లో సంచరిస్తున్న పెద్దపులి (ఎక్స్‌ఫ్లోరర్‌) చివరకు తెలంగాణ వైపు తరలింది. శనివారం కనుమూరు అడవుల నుంచి కొత్తపల్లి మీదుగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం అటవీ ప్రాంతానికి చేరినట్లు అధికారులు నిర్ధారించారు. కొత్తపల్లి గ్రామస్తులు సైతం పులి పాదముద్రల ఫొటోలు తీసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement