డీఎస్‌వో శివరామ్‌ప్రసాద్
పెనమలూరు: బహిరంగ మార్కెట్‌లో బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి టి.శివరామ్‌ప్రసాద్ అన్నారు. ఆయన శనివారం పెనమలూరు, పోరంకి ప్రాంతంలో పలు హోల్‌సేల్, రిటైల్ షాపులను విజిలెన్స్, తూనికలు కొలతల శాఖ అధికారులతో కలిసి విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరలు నియంత్రించటానికి తనిఖీలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 38 కేసులు నమోదు చేసి రూ.1.91 లక్షలు జరిమానా వేశామని తెలిపారు.ఽ దాన్యం, బియ్యం అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించటం, అన్యాయంగా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపారులు వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించాలని సూచించారు.


