సామాజిక ఉద్యమకారుడు పూలే | - | Sakshi
Sakshi News home page

సామాజిక ఉద్యమకారుడు పూలే

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

● మాజీ ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ పూలే స్ఫూర్తితో జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు ● మాజీ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ బీసీల పార్టీ అని చెప్పుకుని వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప ఏనాడైనా వారి గురించి ఆలోచించావా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. ● మాజీ మేయర్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న తన పాలనలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి, ఎస్సీ, బీసీ సెల్‌ నాయకులు, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక ఉద్యమకారుడని వైఎస్సార్‌ సీపీ నేతలు కొనియాడారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలోని పూలే విగ్రహానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అవినాష్‌ మాట్లాడుతూ పూలే ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని స్పష్టం చేశారు. పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వంగానీ, టీడీపీ పరంగాకానీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు.

వైఎస్సార్‌ సీపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement