మహిళల బాల్‌బ్యాడ్మింటన్‌లో ‘విజయ’ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మహిళల బాల్‌బ్యాడ్మింటన్‌లో ‘విజయ’ ప్రతిభ

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

మహిళల బాల్‌బ్యాడ్మింటన్‌లో ‘విజయ’ ప్రతిభ

విజయవాడరూరల్‌: కృష్ణా యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల మహిళల బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను విజయ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ నున్న ఆధ్వర్యాన శనివారం నిర్వహించారు. పోటీల్లో వివిధ కళాశాలల మహిళా క్రీడాకారులు క్రీడా ప్రతిభను చాటారు. ఉత్కంఠగా సాగిన పోటీల్లో విజయ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని పద్మావతి మహిళా కళాశాల, మచిలీపట్నం, తృతీయ స్థానాన్ని డాక్టర్‌ ఎల్‌హెచ్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందగా, చతుర్థ స్థానాన్ని ఎస్‌డీఎంఎస్‌ కళాశాల విజయవాడ గెలిచింది. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జి.విజయ్‌కుమార్‌, కళాశాల సెక్రటరీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement