బస్సు, లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

బస్సు, లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం

Mar 19 2026 10:25 AM | Updated on Mar 19 2026 10:25 AM

బస్సు, లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం

విస్సన్నపేట: స్థానిక విస్సన్నపేట–నూజివీడు రోడ్డులో రాణి కల్యాణమండపం సమీపంలో ఓ ట్రావెల్స్‌ బస్‌, మినీలారీ ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో.. బస్సు రోడ్డు సైడ్‌కు దూసుకెళ్లి ఆగిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో నాలుగు గ్రామాల నుంచి డ్రైవర్‌తో పాటు 42 మంది కలసి నిర్మలగిరి (గౌరీపట్నం )వెళ్లి.. తిరిగి వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన్‌లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్‌ బస్‌ డ్రైవర్‌ లక్ష్మణ్‌రెడ్డికి కాలు విరిగింది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎస్‌ఐ అర్జున్‌ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108లో వైద్యానికి తరలించారు. ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement