మహనీయుల త్యాగాలు అజరామరం | - | Sakshi
Sakshi News home page

మహనీయుల త్యాగాలు అజరామరం

Mar 17 2026 8:14 AM | Updated on Mar 17 2026 8:14 AM

మహనీయుల త్యాగాలు అజరామరం కోనేరుసెంటర్‌: ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం అమరజీవుడైన పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరమని జిల్లా అడిషనల్‌ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ బి.సత్యనారాయణ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీరాములు చిత్రపటానికి ఇరువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ సత్య కిషోర్‌, ఏఆర్‌ఐలు రవికిరణ్‌, రవికుమార్‌, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యత, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి చిలకలపూడి(మచిలీపట్నం): వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు నాణ్యత, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం – 2026 కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లోని మీ కోసం హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు నాణ్యత, ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం వల్ల వారి ఆరోగ్య, ఆర్థిక ప్రమాణాలకు రక్షణ లభిస్తుందన్నారు. వినియోగదారులను తప్పు దారి పట్టించే ప్రకటనల నుంచి వినియోగదారుల రక్షణ చట్టం భద్రత కల్పిస్తుందన్నారు. ఐఎస్‌ఐ, బీఐఎస్‌ హాల్‌మార్క్‌, ఎగ్‌మార్క్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తులు ఉన్న ఉత్పత్తులు నాణ్యత, భద్రతకు హామీగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల అధికారి జి.మోహన్‌బాబు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ టి.శివరామప్రసాద్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారి సీహెచ్‌ గోపాలకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. లండన్‌ వర్సిటీలో ప్రసంగించనున్న శ్రీకాంత్‌ పెడన: లండన్‌ యూనివర్సిటీలో ఈ నెల 21, 22వ తేదీలలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించడానికి తనకు అవకాశం వచ్చిందని నందమూరు శ్రీవాసవి ఇంజినీరింగ్‌ కళాశాల ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ కోవూరి శ్రీకాంత్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో భారతీయ అంతర్జాతీయ కవి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీజయంత మహాపాత్ర కవిత్వంపై భౌతిక శాస్త్ర ప్రభావం అనే అంశంపై ప్రసంగించనున్నట్లు శ్రీకాంత్‌ పేర్కొన్నారు. లండన్‌ యూనివర్సిటీలో ప్రసంగించడానికి ఎంపికై న శ్రీకాంత్‌ను కళాశాల కరస్పాండెంట్‌ కె.కుమార్‌బాబు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దోసపాటి బాబా, ప్రిన్సిపాల్‌ రాజాశ్రీని వాస్‌రెడ్డి అభినందించారు. ఇఫ్తార్‌ విందు ఏర్పాట్ల పరిశీలన లబ్బీపేట(విజయవాడతూర్పు): పవిత్ర రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లింలకు వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18న ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు. లబ్బీపేటలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో సోమవారం ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తలశిల రఘురామ్‌ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనే ఈ ఇఫ్తార్‌ విందులో ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ నేతలు ముస్లిం జేఏసీ కన్వీనర్‌ షేక్‌ మునీర్‌ అహ్మద్‌, ఎండీ రిజ్వాన్‌, ఎండీ నాహీద్‌, సెంట్రల్‌ పరిశీలకులు గౌస్‌ మొహిద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏఎస్పీ నాయుడు

జేసీ నవీన్‌

23.5 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

చల్లపలి: కోళళ్ల ఫారాలకు తరలిస్తున్న 23.5 టన్నుల రేషన్‌ బియ్యాన్ని చల్లపల్లి పోలీసులు సోమవారం పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మండల పరిధిలోని లక్ష్మీపురంలో ఆటోలో రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా రేషన్‌ బియ్యం ఉండడాన్ని గుర్తించారు. బియ్యాన్ని తరలిస్తున్న గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన పి.మాణిక్యాలరావు, లంకపల్లికి చెందిన కె.నాగేంద్రం, డ్రైవర్‌ సాదిక్‌లపై కేసు నమోదుచేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement