బార్‌ అనుమతులు రద్దు | - | Sakshi
Sakshi News home page

బార్‌ అనుమతులు రద్దు

Mar 17 2026 8:14 AM | Updated on Mar 17 2026 8:14 AM

బార్‌ అనుమతులు రద్దు మడ అడవులు నరికితే కఠిన చర్యలు కృత్తివెన్ను: మడ అడవులను నరికితే కఠిన చర్యలు తప్పవని కృత్తివెన్ను తహసీల్దార్‌ శశికుమార్‌ అన్నారు. ‘మడ’తెట్టేస్తున్నారు! అనే శీర్షికన సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల పరిధిలోని నిడమర్రు పంచాయతీలో 105 ఆర్‌ఎస్‌ నంబర్‌లో మడ అడవులను కొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. దీనిపై సాక్షిలో వచ్చిన కథనానికి స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్‌ఐ శ్రీనివాసరావు, వీఆర్‌వోలు నాగరాజు, రామచంద్రరావు మడ భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూములున్నంత మేర ఎర్రజెండాలు పాతి హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూముల్లో ఎటువంటి అనైతిక కార్యకలాపాలు జరిపితే చట్టపరంగా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యదర్శులకు ఉద్యోగోన్నతి

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బార్‌ను పరిశీలించిన ఎకై ్సజ్‌ శాఖ డీసీ

చిలకలపూడి(మచిలీపట్నం): నిబంధనలకు విరుద్ధంగా మంగిన పూడిబీచ్‌ రోడ్డులో బార్‌ షాపును నిర్వహిస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు పరిశీలించిన అనంతరం అమ్మకాలను నిలిపివేసి, సస్పెండ్‌ చేస్తున్నట్లు ఎకై ్సజ్‌ డెప్యూటీ కమిషనర్‌ టి. శ్రీనివాసరావు తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ‘కిక్కు’రుమనడం లేదు! శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి, మచిలీపట్నంలోని ఎకై ్సజ్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీ మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన లాటరీ పద్ధతిలో నిర్వహించిన ప్రక్రియలో ఎంపికై న లైసెన్సుదారుడికి ప్రొవిజినల్‌ లైసెన్సు అందజేశామని తెలిపారు. అయితే 40 రోజులు గడుస్తున్నా ఇంత వరకు అన్ని సదుపాయాలతో బార్‌ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. అంతేకాకుండా తాత్కాలికంగా అమ్మకాలు జరుపుతున్నారని తమ దృష్టికి రావటంతో ఎకై ్సజ్‌ అధికారులు పరిశీలించి, నిబంధనలకు లోబడి లేకపోవటంతో వెంటనే అమ్మకాలను నిలిపివేసి, అనుమతులు సస్పెండ్‌ చేశామన్నారు. లైసెన్సుదారుడికి నోటీసులు జారీ చేశామన్నారు. వారు ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు ఉంటాయన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సోమవారం 77 మంది కార్యదర్శులకు గ్రేడ్‌–4 నుంచి గ్రేడ్‌–3గా సీనియారిటీ ప్రకారం ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కలెక్టర్‌ ఆయన చాంబర్‌లో అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement