9,10,11 తేదీల్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో
రామవరప్పాడు(విజయవాడ రూరల్): విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 9,10,11 తేదీల్లో క్రెడాయ్ 11వ ప్రాపర్టీ షో జరుగుతుందని సంస్థ విజయవాడ చాప్టర్ చైర్మన్ సతీష్‌బాబు, అధ్యక్షుడు మోహన్‌రావు తెలిపారు. క్రెడాయ్ 11వ ప్రాపర్టీ షో సందర్భంగా రామవరప్పాడు రింగ్ సమీపంలోని ఓ హోటల్‌లో మంగళవారం కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. సొంత ఇంటిని సాకారం చేసుకోవడం మధ్య తరగతి వారి కలని, దానిని నెరవేర్చడంలో భాగంలోనే క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ప్రాపర్టీ షోలు నిర్వహించి, అన్ని విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొస్తోందని తెలిపారు. ఈ ప్రాపర్టీ షోలో 50 స్టాళ్లు ఉంటాయన్నారు. ఈ స్టాళ్లలో పోసమ్ ఇన్‌ఫ్రా, బీబీజీ, లచన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, పీవీఆర్ గ్రూప్, వీఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, ఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా, హిమజ కన్‌స్ట్రక్షన్స్, హరివిల్లు ప్రొమోటర్స్ వివిధ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వీరే కాకుండా ఐసీఐసీఐ, యూనియన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇతర ప్రముఖ బిల్డర్లు, గృహోపకరణాల కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలిపారు. గృహోపకరణాలకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఒకే సముదాయంలో లభించడం గృహ నిర్మాణదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ షోలో వినియోగదారులకు ప్లాట్ నచ్చితే వారికి అక్కడే బ్యాంక్‌ల ద్వారా రుణ సౌకర్యం కలిగించే సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ షోకు హాజరయ్యే వినియోగదారుకుల ప్రత్యేక కూపను ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ కార్యదర్శి రఘరామ్, కోశాధి కారి సాయిరామ్, మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్టాల్ హోల్డర్లు పాల్గొన్నారు.


