భక్తజన సందడి | - | Sakshi
Sakshi News home page

భక్తజన సందడి

Nov 4 2024 1:05 AM | Updated on Nov 4 2024 1:05 AM

భక్తజ

భక్తజన సందడి

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సన్నిధికి భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోలాహలం నెలకొంది. కార్తికమాసం కావడంతో తెల్లవారు జామునుంచే భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి సన్నిధిలో మహిళలు దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు. నిత్యాన్నదానం ప్రాంగణం భక్తులతో నిండి పోయింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరిటెండెంట్‌ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భక్తజన సందడి 1
1/1

భక్తజన సందడి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement