వాంకిడి: మండల కేంద్రంలోని ఛత్రపతి శివా జీ విగ్రహం వద్ద శుక్రవారం ఆరె సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి సాహూ మహరా జ్ 152వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భారతీయ సామాజిక న్యాయ చరిత్రలో అగ్రగన్యుడిగా సాహూ మహరాజ్‌ను అభివర్ణించారు. సామాజిక అసమానతలు రూపుమాపి సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి అపారమైందన్నారు. కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం, మండల అధ్యక్షుడు బొయిరె ప్రకాశ్, నాయకులు పెంటు, విలాస్, తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో నిర్వహించిన జయంతి కార్యక్రమాల్లో బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, ఎస్‌ఎస్‌డీ జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్ తదితరులు పాల్గొన్నారు.


