అందుబాటులో సరిపడా యూరియా | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో సరిపడా యూరియా

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

వాంకిడి: వర్షాకాలం సాగుకు సంబంధించి జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటి అన్నారు. మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను శుక్రవారం తనిఖీ చేశారు. స్టాక్‌ రికార్డులు, బిల్లింగ్‌ రశీదులు పరిశీలించారు. దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా రైతులకు బిల్లు అందించాలని ఆదేశించారు. స్టాక్‌ వివరాలు ఎప్పటికప్పుడు ప్రదర్శించాలన్నారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధిక ఎరువులు, రసాయనాల వాడకం దిగుబడిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement