బడుల్లో తిథి భోజనం | - | Sakshi
Sakshi News home page

బడుల్లో తిథి భోజనం

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

ప్రభుత్వ పాఠశాలల్లో వేడుకలు, ప్రత్యేక రోజులు జరుపుకొనే అవకాశం ‘పీఎం పోషణ్‌’ కింద అమలుకు నిర్ణయం విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు నిర్ణయం

కెరమెరి: ఒకప్పుడు పుట్టిన రోజులు, వివాహ వార్షి కోత్సవాలు, శుభకార్యాలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకే పరిమితమయ్యేవి. ప్రస్తుతం ప్ర జల ఆలోచన విధానంలో మార్పు వ చ్చింది. వ్యక్తిగత సంతోషాన్ని సమాజంతో పంచుకోవాలనే భావ న బలపడింది. అనాథ అశ్రమాలకు విరాళాలు ఇవ్వడం, అన్నార్థుల కు ఆహారం అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్ర మంలో మారుతున్న సామాజిక ధోరణుల కు అనుగుణంగా ప్ర భుత్వ పాఠశాలల్లో పీఎం పోషణ్‌ పథకంలో భాగంగా ‘తిథి భోజ నం’ కార్యక్రమానికి పిలు పునిచ్చింది. 2026–27 విద్యా సంవత్సరానికి పీఎం పోషణ్‌ మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా దీనిని చేర్చారు.

ప్రత్యేక రోజులు పాఠశాలల్లో..

జిల్లాలోని 994 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొనసాగుతోంది. ప్రస్తుతం 35,976 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు గతంలో కేవలం విద్యా సంస్థలుగా మాత్రమే కాకుండా సామాజిక జీవితానికి కేంద్ర బిందువుగా ఉండేవి. విద్యార్థుల సంక్షేమం గురించి గ్రామ పెద్దలు, దాతలు, పూర్వ విద్యార్థులు బాధ్యతగా తీసుకునేవారు. కాలక్రమేణా విద్యావ్యవస్థ, సమాజానికి మధ్య అంతరం పెరిగింది. ఈ నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ‘తిథి భోజనం’ కార్యక్రమాని కి ప్రాధాన్యతనిస్తోంది. బర్త్‌డేలు, వివాహ వార్షికో త్సవాలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం నిర్వహించే కార్యక్రమాలను పాఠశాలల్లో జరుపుకొనేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక కు టుంబం, సామాజిక సంస్థలు, మిత్ర బృందాలు తమ సంతోషాన్ని బడి పిల్లలతో పంచుకునే అవకాశం కల్పిస్తారు. తద్వారా విద్యార్థులకు ప్రత్యేక భోజనం, అదనపు పోషకాహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. కేవలం దాతృత్వం కోణంలోనే కాకుండా పాఠశాలలకు, సమాజానికి మధ్య అనుబంధంగా బలపర్చే గొప్ప వేదికగా మారుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్‌లో విజయవంతంమైన ఈ నమూనాను తెలంగాణలో కూడా అమలు చేయనున్నారు.

నాణ్యత, పరిశుభ్రతలో రాజీలేకుండా..

ఇప్పటికీ అన్నదానం అనేది ఒక మహోన్నత సంప్రదాయంగా కొనసాగుతోంది. తిథి భోజనం కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందించమే కాకుండా సమాజం తమ వెంట ఉందనే భరోసాను అందిస్తుంది. పోషకాహార లోపాలు తగ్గించడం, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. వలస వెళ్లిన ప్రజలు, ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు తమ బడితో అనుబంధాన్ని కొనసాగించేందుకు వేదికగా నిలుస్తుంది. అనుబంధం పెరిగితే పాఠశాలలకు అవసరమైన గ్రంథాలయాలు, క్రీడాసామగ్రి, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరికొంత మంది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే తిథి భోజనంలో ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. జంక్‌ ఫుడ్‌ పిల్లల దరికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. వ్యక్తిగత ప్రచారానికి వేదిక కాకుండా చూసుకోవాలి. విద్యార్థుల మధ్య వివక్ష లేకుండా పాఠశాల యాజమాన్యమే చర్యలు చేపట్టాలి.

ప్రచారం నిర్వహించాలి

ప్రభుత్వం పాఠశాలల్లో తిథి భోజనం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం ఎంతో మంచిది. ప్రభుత్వ పాఠశాలలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. అన్ని పాఠశాలలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలి. పెళ్లి రోజులు, జన్మదినాలు, ఇతర కార్యక్రమాలు బడిలో నిర్వహించాలనే ఆలోచన ప్రజల్లో కలిగించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల మధ్య అనుబంధం పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

– ఆడే ప్రకాశ్‌, పీఆర్టీయూ

రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement