అయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

అయ్యేనా?

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

● ఆటస్థలాల అభివృద్ధికి ప్రతిపాదనలు ● కౌటాల మినీ స్టేడియాన్ని మెరుగుపరిస్తే ఎంతో మేలు.. ● క్రీడాకారుల్లో చిగురిస్తున్న ఆశలు

గేమ్‌చేంజ్‌

ఆసిఫాబాద్‌రూరల్‌/కౌటాల: జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదు. కానీ ఆట స్థలాలు, సరైన సౌకర్యాలు లేక ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. జిల్లాకు చెందిన ఆడె సంతోష్‌ హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో మెరుగైన ప్రదర్శన చేయగా, అతడిని టీజీ20 లీగ్‌లో రూ.95 వేలకు అన్విత ఖమ్మం ఏసెస్‌ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. కౌటాల, ఆసిఫాబాద్‌, రెబ్బెన, బెజ్జూర్‌, సిర్పూర్‌(టి), కాగజ్‌నగర్‌, చింతలమానెపల్లి, దహెగాం, వాంకిడి, పెంచికల్‌పేట్‌ మండలాల్లో ఐపీఎల్‌ తరహాలో ఏటా స్థానిక లీగ్‌లు నిర్వహిస్తున్నారు. క్రికెట్‌తోపాటు కబడ్డీ, వాలీబాల్‌ పోటీలను కూడా పెద్దఎత్తున సాగుతున్నాయి. అయితే కౌటాల మినహా మరెక్కడా పూర్తి స్థాయి మైదానాలు లేవు. ఈ నెల 22న జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్‌ చైర్‌ పర్సన్‌ సోని బాలాదేవి క్రీడామైదానాల అభివృద్ధికి ప్రతి పాదనలు సిద్ధం చేయాలని ఆదేశించడంతో స్థానిక క్రీడాకారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జన్కాపూర్‌ క్రీడామైదానానికి స్థలం, వసతుల కల్పనతో పాటు కౌటాల మినీ స్టేడియం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని ఆమె ఆదేశించారు.

మైదాన స్థలంలో పిచ్చిమొక్కలు

గతంలో బస్‌స్టేషన్‌ పక్కన ఉన్న క్రీడామైదానం అందరికీ అందుబాటులో జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉండేది. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత ఆ మైదానా న్ని పోలీస్‌ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. అక్కడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో క్రీడాకారులు, వాకింగ్‌ చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ క్రీడామైదానం కోసం 12 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఈ స్థలంలో పిచ్చిమొక్కలు, చెట్లు దట్టంగా పెరిగా యి. వీటిని తొలగించి చుట్టూ ప్రహరీ నిర్మించి లోపలికి ఎవరూ వెళ్లకుండా గేటు ఏర్పాటు చేయా లి. క్రీడాసామగ్రి భద్రపరచడానికి గదులు, మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్‌ సౌకర్యంతో పాటు 400 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కోర్టులను ఏర్పాటు చేయాలి. తద్వారా పోలీస్‌, ఆర్మీ ఉద్యోగాల కోసం సాధన చేసే యువతకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.

కౌటాల మినీ స్టేడియం మారేనా..!

కౌటాల మండల కేంద్రానికి సమీపంలో 25 ఏళ్ల క్రితం ఆరెకరాల స్థలంలో మినీ స్టేడియం ఏర్పాటు చేశారు. ఇందులోనే రూ.లక్షలు వెచ్చించి ఇండోర్‌ స్టేడియం సైతం నిర్మించారు. ఆట పరికరాలు, శిక్షకులు అందుబాటులో లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. గతేడాది నుంచి ఓ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అక్కడ యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. వాకింగ్‌ ట్రాక్‌ లేకపోవడంతో మైదానం ప్రహరీ చుట్టూనే నడుస్తున్నారు. మైదానంలోనే 33 కేవీ విద్యుత్‌ లైన్‌కు సంబంధించిన ఏడు స్తంభాలు ఉండడంతో ఆటల నిర్వహణకు ఇబ్బందులు తప్పడం లేదు. వాకింగ్‌ ట్రాక్‌పైనే ఈ స్తంభాలు ఉండడంతో ప్రమాదం పొంచి ఉంది. భవనం నిరుపయోగంగా ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ అథ్లెటిక్స్‌, వాలీబా ల్‌, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్‌బాల్‌ వంటి వివిధ క్రీడల కోసం ప్రత్యేక కోర్టులు నిర్మించాల్సి ఉంది. క్రీడాకారుల కోసం వాకింగ్‌ ట్రాక్‌, రన్నింగ్‌ ట్రాక్‌, స్టేడియం ఆవరణలో సరిపడా లైటింగ్‌, తాగునీరు తదితర సదుపాయాలు కల్పించాలి. క్రికెట్‌ కోసం టర్ఫ్‌ పిచ్‌ ఏర్పాటు చేసి సరైన శిక్షణ అందిస్తే స్థానిక యువత సైతం దేశవాళీ, ఐపీఎల్‌ పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఓపెన్‌ జి మ్‌లు, క్రికెట్‌ కోచింగ్‌ నెట్‌లు కూడా ఏర్పా టు చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement