దహెగాం/కౌటాల/సిర్పూర్(టి): విద్యుత్ సరఫ రా, సదుపాయాల బలోపేతమే తమ లక్ష్యమని టీ జీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నా రు. కాగజ్‌నగర్ డివిజన్‌లో గురువారం విస్తృతంగా పర్యటించారు. సిర్పూర్(టి), బెజ్జూర్, కౌటాల, దహెగాంలోని 32/11 కేవీ సబ్ స్టేషన్లను పరిశీలించారు. కన్నెపల్లి నుంచి దహెగాంకు వచ్చే ఇంటర్ లింక్ లైన్ పనులను తనిఖీ చేశారు. 20 కిలోమీటర్ల ఇంటర్ లింకింగ్ లైన్‌తో దహెగాం, పెంచికల్‌పేట్ మండలాలకు ఈదురుగాలుల సమయంలోనూ అంతరాయం తప్పుతుందని పేర్కొన్నారు. విద్యుత్ మరమ్మతుల సమయంలో సిబ్బంది భద్రత పాటించాలని సూచించారు. యాప్ ద్వారానే ఎల్‌సీలు తీ సుకోవాలన్నారు. అటవీ ప్రాంతాలైన వేంపల్లి, పెద్దబండ, సార్సాల, ఎల్కపల్లి వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర కవర్డ్ కండక్టర్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. బెజ్జూర్ నుంచి కర్జవెల్లి వరకు 20 కిలోమీటర్ల ఇంటర్ లింకింగ్ లైన్ పనులు వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. డీఈ నాగరాజు, డీఈ టెక్నికల్ సుధాకర్, ఈఈ సివిల్ శ్రీనివాస్, ఏఈ రవీందర్, సబ్ ఇంజినీరు వెంకటేశ్వర్లు, ఎస్‌ఎల్‌ఐ మురళీధర్, డీఈటీ సుధాకర్, ఏడీఈలు ఇర్ఫాన్ అహ్మద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


