ఆసిఫాబాద్‌అర్బన్: యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు గడువులోగా పూర్తిచేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్ కె.హరిత అన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.50కోట్ల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నబియ్యంతో చేసిన ఏడు రకాల పిండివంటల కిట్లను గురువారం సంబంధిత అధికారులకు అందించారు.
ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో గురువారం కలెక్టర్ కె.హరిత ఆర్వో వాటర్ ప్లాంట్‌ను గురువారం ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమలో సూపరింటెండెంట్ అవినాష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


