ఆసిఫాబాద్‌రూరల్: సీపీఎస్ రద్దు చేయాలని గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదు ట స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు నిరసన చేపట్టారు. అనంత రం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊషన్న మాట్లాడుతూ ప్రభుత్వం నూతన విద్యావిధానం– 2020 రద్దు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో నూతన పాఠశాలలు తెరవాలని డిమాండ్ చేశారు. 1– 7– 2023 నుంచి పీఆ ర్సీ అమలు చేసి, ఐదు పెండింగ్ డీఏలు మంజూరు చేయాలన్నారు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిస్తూ, విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని కోరారు. నాయకులు ఇందురావు, రమేశ్, హేమంత్, రాజలింగు, సంతోష్, తిరుపతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


