కెరమెరి: గిరిజన సహకార సంస్థ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని జీసీసీ డివిజనల్ మేనేజర్(డీఎం) జి.సందీప్‌కుమార్ అన్నారు. జైనూర్ మండలం ఉషేగాంలోని డీఆర్ డిపోను బుధవారం తనిఖీ చేశారు. బియ్యం, సరుకుల స్టాక్ వివరాలు పరిశీలించారు. ఇప్పపువ్వు, తేనె వంటి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, నిత్యావసర వస్తువుల విక్రయాలు పెంచాలన్నారు. అనంతరం జైనూర్ మండల కేంద్రంలో జీసీసీ, ఐటీడీఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను సందర్శించారు. ఇంధన విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు.


