పట్నాలు వేసి.. బోనాలు సమర్పించి | - | Sakshi
Sakshi News home page

పట్నాలు వేసి.. బోనాలు సమర్పించి

Jun 25 2026 1:12 AM | Updated on Jun 25 2026 1:12 AM

నెత్తిన బోనం.. చుట్టూ జనం.. అడుగులో అడుగేస్తూ ముందుకు కదులుతున్న మహిళలు.. డప్పుచప్పుళ్ల మధ్య కౌటాల బీరన్న ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శీర్షా గ్రామానికి చెందిన గొల్ల కురుమలు మండల కేంద్రంలోని బీరన్న ఆలయం వద్ద వారం రోజులుగా సంప్రదాయబద్ధంగా పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్నాలు వేశారు. ఎమ్మెల్సీ దండె విఠల్‌ నాయకులతో కలిసి పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు గొల్లకురుమల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకీరావు, మండల అధ్యక్షుడు నికాడే గంగారాం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

– కౌటాల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement