కెరమెరి: మార్కెట్ కమిటీ కార్యాలయంతోపాటు 12 గదుల భవన సముదాయాల నిర్మాణంతో మార్కెట్ కమిటీకి స్థిరమైన ఆదాయం వస్తుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జైనూర్ మండల కేంద్రంలో రూ.1.25కోట్లతో నిర్మించిన మార్కెట్ కమిటీ భవనాన్ని బుధవారం ఆసిఫాబాద్, ఖానా పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలన్నారు. విత్తనాలు, ఎరువుల కొ నుగోలు సమయంలో తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు. పంట చేతికొచ్చేవరకు వా టిని భద్రపర్చుకోవాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, వైస్ చైర్మన్ జైవంతరావు, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, గ్రంథాలయ చైర్మన్ అనిల్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ముఖీద్, సర్పంచ్ ప్రకాశ్ పాల్గొన్నారు.


