రెబ్బెన: మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఏడు సన్నరకం వరిధాన్యం వంగడాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వాటినే రైతులు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ అన్నా రు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంపిక చేసిన తెలంగాణ సోనా, జై శ్రీరాం, హెచ్‌ఎంటీ సోనా, బీపీటీ– 5204, కేఎన్‌ఎం– 1638, కేఎన్‌ఎం– 7715 రకాలను మాత్రమే రైతులు ఎంచుకోవాలని సూచించారు. రైతులు మామూలు యూరియా, డీఏపీల వాడకాన్ని తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ వాడుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పంట మార్పిడి వైపు దృష్టి పెట్టాలని కోరారు. తక్కువ నీటి వినియోగం ఉండే కందులు, జొన్నలు వంటి పంటల సాగు ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఈ నెల 30న జరిగే రైతుమేళాలో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో దిలీప్‌కుమార్, ఏఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు.


