ఇళ్ల మంజూరు తీరుపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల మంజూరు తీరుపై ఆందోళన

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

కెరమెరి: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అనర్హులకు ఇళ్లు మంజూరు చేశారని ఆరోపిస్తూ మంగళవారం మండలంలోని గోయగాం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన తెలిపారు. గ్రామానికి 42 ఇళ్లు మంజూరు కాగా, ఒకే వార్డులో అనర్హులకు కేటా యించారని ఉదయం పంచాయతీ కార్యాలయంలో అధికారులను నిలదీశారు. జిల్లా అధికారులు అందించిన జాబితా ప్రకారమే సర్వే చేశామని, ఇళ్ల కేటాయింపులో తమ ప్రమేయం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్‌ వచ్చి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. సమస్యను అధి కారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. బాపూజీ, పోశెట్టి, ప్రేమల, ఇస్లాంబిన్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement