ఆసిఫాబాద్‌అర్బన్: మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్ పే కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులు, సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కనీస వేతనంగా రూ.26వేలు నిర్ణయించాలని, ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని, రెయిన్ కోట్లు, స్వెటర్లు, బట్టలు, కొబ్బరినూనె, ఇతర సామగ్రి అందించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలు జమ చేయాలని, మృతి చెందిన కార్మికుల దహన సంస్కారాలకు ఖర్చుల నిమిత్తం రూ.30వేలు చెల్లించాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమాచారి, పెరక శ్రీకాంత్, మాట్ల రాజు, శంకర్, సంజీవ్, తోట సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


