కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి మంగళవారం ఘనంగా నిర్వహించా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఒక దేశం– ఒకే రాజ్యాంగం సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లిన మహోన్న త నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ అనిత, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, పుల్ల అశోక్, రాము, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


