సబ్‌ స్టేషన్‌ మంజూరు చేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

సబ్‌ స్టేషన్‌ మంజూరు చేయాలని వినతి

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

దహెగాం: మండలంలోని చిన్న ఐనం గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరా బాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందించారు. చిన్న ఐనం, పెద్ద ఐనం, పోలంపల్లి, మురళీగూడ, పెసరికుంట గ్రామాల్లో లోవోల్టేజీ, హైవోల్టేజీ, బ్రేక్‌ డౌన్‌ సమస్యలు అధిగమించడానికి సబ్‌స్టేషన్‌ అవసరమని పేర్కొన్నారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో సబ్‌స్టేషన్‌ మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement